ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (15:26 IST)

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల

NBK 108 look
NBK 108 look
నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలసి #NBK108 తో మాసెస్, అభిమానులు, కుటుంబ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్, అనిల్ రావిపూడి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. క్రేజీ కాంబినేషన్‌ లో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
 
బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ ని విడుదల చేసి అందరికి మాస్ ఫీస్ట్ అందించారు మేకర్స్. బాలకృష్ణ రెండు విభిన్నమైన అవతారాల్లో కనిపిస్తున్న రెండు పోస్టర్లను విడుదల చేశారు. మొదటి పోస్టర్‌ లో  సాంప్రదాయ దుస్తులు ధరించి, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌ లో కనిపించారు బాలకృష్ణ. మెడ, చేతిపై పవిత్రమైన దారాలను ధరించడం ఆసక్తికరంగా వుంది. బాలకృష్ణ చేతిపై టాటూ కూడా ఉంది. రెండు పోస్టర్లలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని గెటప్‌ లలో కనిపిస్తున్నారు.
 
 మరో పోస్టర్ గడ్డం, హ్యాండిల్‌ బార్ మీసాలతో అగ్రెసివ్ అవతార్‌ లో ప్రజంట్ చేసింది. బాలకృష్ణ వెనుక ఉదయించే సూర్యుడిని చూడవచ్చు. ఈ పోస్టర్ లో చాలా యంగర్ గా కనిపిస్తున్నారు. రెండు పోస్టర్లు మాస్ ని ఆకట్టుకొని చాలా క్యూరియాసిటీని పెంచాయి. ‘’This time beyond your imagination’ అనే  ట్యాగ్‌లైన్ మరింత ఆసక్తిని కలిగించింది.
ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది.