ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (19:31 IST)

విజయోత్సవం జరుపుకుంటున్న నాని- వాల్ పోస్టర్ బేనర్లో కొత్తవారితో సినిమా

nani celebrations
nani celebrations
నాని తాజా సినిమా సరిపోదా శనివారం రెండో వారంలో ప్రవేశించింది . రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల భీబత్సం వున్నా కలెక్టన్లు ఆశించినంతగా వున్నాయని చిత్ర నిర్మాత డివివి దానయ్య తెలియజేశారు. నార్త్ అమెరికాలో మంచి వసూలు చేసిందని తెలియజేశారు. తెలుగులోనూ ఆశించిన విజయం లభించడం ఆనందంగా వుందని తెలిపారు. 
 
హైదరాబాద్ లోని శిల్పకలావేదికలో కొద్దిసేపటి క్రితమే అభిమానులతో సక్సెస్ వేడుకసభ ప్రారంభమైంది. చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు హాజరుకానున్న ఈ వేడుకలో నాని చిత్రాల్లోని పాటలను ప్రదర్శిస్తున్నారు. ఇదేరోజు నాని హిట్ 3 సినిమా గురించి ప్రకటన కూడా వెలువడింది. ఇది కాకుండా మరో రెండు సినిమాలను చేయడానికి నాని సిద్ధమయ్యారు. నాని స్వంత బేనర్ అయిన వాల్ పోస్టర్ నిర్మాణంలో అంతా కొత్త వారితో మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం అవుతోంది.