శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 24 నవంబరు 2018 (20:01 IST)

నాని జెర్సీ రిలీజ్ డేట్ ఫిక్స్

కృష్ణార్జున యుద్ధం సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో.. నాని క‌థ‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నాడ‌ట‌. కింగ్ నాగార్జున‌తో క‌లిసి నాని న‌టించిన దేవ‌దాస్ చిత్రం బాగానే ఉంది అనిపించుకుంది కానీ... ఆశించిన స్ధాయిలో స‌క్స‌స్ సాధించ‌లేక‌పోయింది. దీంతో త‌దుప‌రి చిత్రంతో ఎలాగైనా స‌రే విజ‌యం సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో చేస్తున్నాడు. మళ్లీరావా ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరితో జెర్సీ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. 
 
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను డిఫరెంట్‌గా రిలీజ్‌ చేశారు. ఓ బ్యాట్ పైన జెర్సీ అనే టైటిల్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు. ఇంత‌కీ ఎప్పుడంటే ఏప్రిల్ 19న రిలీజ్ చేయ‌నున్నట్టు తెలియ‌చేసారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.