శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Updated : సోమవారం, 23 నవంబరు 2020 (20:09 IST)

ప్రియుడి కోసం నయనతార అంధురాలి పాత్రలో... (video)

నయనతార ప్రేమ అంటే అలా ఇలా ఉండదు. ఆమె ప్రేమిస్తే ఏది చేయడానికైనా రెడీగా ఉంటుంది. స్వతహాగా క్రిస్టియన్ అయిన నయనతార ప్రభుదేవా కోసం హిందూ మతాన్నే స్వీకరించింది. ప్రభుదేవాతో బ్రేకప్ తరువాత దర్సకుడు విగ్నేష్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. ప్రియుడి కోసం అంధురాలి పాత్రలో నటించడానికి సై అంటోంది నయనతార.
 
నయనతార గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు మంచి ఫెర్ఫార్మర్. శ్రీరామరాజ్యంలో సీత పాత్రలో మెప్పించి నంది అవార్డును కూడా అందుకుంది. ఈమధ్య కాలంలో యాక్టివ్‌గా స్కోప్ ఉన్న పాత్రలను ఎక్కువగా చేస్తోంది. ఈ క్రమంలో గతంలో చెవిటి క్యారెక్టర్లో నటించిన నయనతార అంధురాలిగా కూడా చేయబోతోంది. 
 
చిన్న టీజర్లో ఇప్పటికే నయనతారను నెటిజన్ల బాగా పొగడ్తతో ముంచెత్తుతున్నారట. తాను అంధురాలి పాత్రలో చేయడానికి ప్రియుడు విగ్నేష్ శివ కారణమట. నయనతార నటిస్తున్న సినిమాకు విగ్నేష్ నిర్మాతగా ఉన్నారట. బుధవారం నయనతార పుట్టినరోజు కావడంతో ఆ ట్రైలర్‌ను నిన్ననే రిలీజ్ చేశారు. అంధురాలిగా చేయడం నయనతారకు ఏ మాత్రం ఇష్టలేకపోయినా ఒక్క ప్రియుడి కోసమే ఈ క్యారెక్టర్‌ను ఒప్పుకుందట.