శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 మార్చి 2021 (20:01 IST)

ఉదయనిధితో నయనతార సహజీవనం : వెల్లడించిన రాధారవి (video)

తమిళ సీనియర్ నటుడు రాధారవి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్ కోలీవుడ్ హీరోయిన్ నయనతారతో సహజీవనం చేస్తున్నారంటూ లింకుపెట్టారు. ఈ విషయాన్ని తమిళ సీనియర్ నటుడు రాధారవి సంచలన విమర్శలు చేశారు. 
 
రాధారవి చేసిన వ్యాఖ్యలపై డీఎంకే వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తూ, డీఎంకే శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా, కోలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా రాధారవి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, తమిళనాడు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఉదయనిధి చెప్పాక్కం - తిరువళ్లికేణి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 
 
మరోవైపు, కమలహాసన్‌ను కూడా ఆయన వదిలిపెట్టలేదు. భార్యలను కాపాడుకోలేకపోయిన కమల్... రాష్ట్రాన్ని ఏం కాపాడతారని ఆయన విమర్శించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాధారవి వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.