రాజకీయరంగమైనా, సినిమా రంగమైనా ఏ ఒక్కరికి చెందింది కాదు : పవన్ కళ్యాణ్
సినిమా పరిశ్రమ అందరిదీ. మా కుటుంబానికి చెందింది కాదు. ఎవరైనాసరే కోట్లాదిమందిలో మీరు బలంగా అనుకుంటే సాధించగలరు. అటు రాజకీయరంగమైనా ఇటు సినిమా రంగమైనా ఏ ఒక్కరికి చెందింది కాదు. మేమే దిగువ మధ్యతరగతి నుంచి వచ్చి సాధించాం. మీరు సాధించగలరు అని పవన్ కళ్యాణ్ ప్రజలనుద్దేశించి తెలిపారు. సాయితేజ్‌తో కలిసి నటించిన చిత్రం బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. మంగళవారం రాత్రి వర్షంలోనూ అభిమానుల సమక్షంలో శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి కుటుంబ హీరోలు పాల్గొన్నారు.
Pawan Kalyan-Samudrakhani
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సాహిత్యంలో పట్టు వుంటే గొప్ప సినిమాలు తీయగలరు. అలా తమిళంలో పట్టు వున్న సముద్రఖని బ్రో అనే అద్భుతమైన సినిమా తీశారు. నాకు తెలుగులోనే స్క్రిప్ట్ రాసుకుని ఆయన వినిపించారు. ఏడాదిన్నర పాటు తెలుగు నేర్చుకున్నానని చెబితే ఆశ్చర్యపోయా. తెలుగు మాతృభాష అయి వుండి మనం చేయలేని పనికి మాకు చెంపపెట్టు అయింది. సముద్రఖని తమిళనాడులోని సాహిత్యం నేర్చుకోబట్టే కొత్త కథ చెప్పగలిగారు. సముద్రఖనికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 50 రోజులు 70 రోజులు చేయాల్సిన సినిమాను త్వరంగా పూర్తయ్యేలా చేశారు.
సినిమా ఇష్టం సమాజం అంటే ప్రేమ
పొలిటికల్ మైండ్ సెట్ అయ్యాక సిసినిమా అంటే ఇష్టం. ప్రేమ. సమాజం అంటే బాధ్యతగా మారింది. నేను జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్‌చరన్‌లా డాన్స్ చేయలేను. ప్రభాస్, రానా లాగా సంవత్సరాలు కష్టపడలేను. అందుకే వైష్ణవ్ తేజ్, సాయితేజ్, వరుణ్ తేజ్‌కు చెబుతుంటా. మన కష్టమే మనకు రక్ష అని.
నన్ను మా వదిన చెడగొట్టింది
మాకూ ఇండస్ట్రీలో అండాదండా లేదు. చిరంజీవిగారు మెగాస్టార్ డమ్ సాధించాక.. నువ్వు హీరో అవుతావా! అన్నారు. నాకు భయమేసింది. కృష్ణగారు నాకు ఇష్టం. ఎన్.టి.ఆర్. ఎ.ఎన్.ఆర్. పెద్ద నటులున్నారు. ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసి పొలం పనులు చూసుకోవాలనుకున్నాను. మా వదినగారు నన్ను ఎగదోశారు. అది ఎప్పుడు తెలిసిందంటే, వైజాగ్‌లో జగదాంబ సెంటర్‌లో బస్ ఎక్కి డాన్స్ వేయాలనే సీన్ సుస్వాగతం సినిమాకు చేయాల్సివుంది. నాకు అంతమందిని చూశాక ఏడుపు వచ్చింది. పదిమందిముందు చేయాలంటే సిగ్గు. మాట్లాడాలంటే.. సిగ్గు.. మా వదికు ఫోన్ చేసి నన్ను ఎందకు ఎగదోశావని అడిగాను. మా వదిన చేసిన తప్పు ఇప్పుడు మాటల్లో వర్ణించలేని విధంగా ఇలా మీ ముందుకు తీసుకువచ్చింది అని అన్నారు.