సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: బుధవారం, 12 జనవరి 2022 (14:44 IST)

తిరుమలలో నిధి అగర్వాల్, అభిమానుల తోపులాటలో..?

తిరుమల శ్రీవారి సన్నిధిలో "హీరో'' మూవీ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఇవాళ ఉదయం వి.ఐ.పి‌ విరామ సమయంలో అశోక్ గల్లా, నిధి అగర్వల్, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య, ఘట్టమనేని పద్మావతి, పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్‌లు స్వామి వారి‌ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

 
అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల అశోక్ గల్లా మాట్లాడుతూ.. "హీరో" చిత్రం మంచి సక్సస్ సాధించాలని స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామన్నారు.

 
చిత్రం ప్రొడ్యూసర్ గల్లా పద్మావతి మాట్లాడుతూ.. ఎక్కడున్నా మా అన్నయ్య రమేష్ ఆత్మ ప్రశాంతంగా ఉండాలని స్వామిని ప్రార్ధించానని, మా అబ్బాయి హీరో సినిమా ద్వారా హీరోగా పరిచయం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.. యూత్, ఫ్యామిలీని ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని, సంక్రాంతికి ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నట్లు ఆమె తెలియజేశారు.

 
అనంతరం పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ.. మా పెద్దబ్బాయి అశోక్ హీరోగా నటించిన చిత్రం మంచి విజయం సాధించాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని, కరోనా త్వరగా అంతమై అందరూ సంతోషంగా ఉండాలని ప్రార్ధించినట్లు ఆయన‌ తెలిపారు.

 
అయితే దర్శనం తరువాత బయటకు వచ్చిన నిధి అగర్వాల్ ఇబ్బంది పడాల్సి వచ్చింది. అభిమానులు ఒకరిపై ఒకరు తోసుకోవడమే కాకుండా నిధితో ఫోటోలు తీసుకోవడానికి ప్రయత్నించండంతో ఆమె కాస్త ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.