సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (22:39 IST)

బెడ్‌రెస్ట్‌లో నిహారిక‌!

Niharika photo
నిహారిక కొణిదెల వైవాహిక జీవితంలో అడుగు పెట్టాక ఇంటిప‌నుల‌కే ప‌రిమితం అయింది. కానీ మ‌ధ్య‌లో ఓ వెబ్‌సిరీస్‌లో చేయ‌డానికి సిద్ధ‌మైంది. త‌నకు అత్తింటివారి స‌పోర్ట్ ఫుల్‌గా వుంద‌ని తెలియ‌జేసింది కూడా. వివాహం త‌ర్వాత ప‌లు ప్రాంతాల‌ను ప‌ర్య‌టించి తిరిగి వ‌చ్చిన ఆమె ప్ర‌స్తుతం బెడ్‌పై వుంది. ఆమెకు చెందిన సోష‌ల్‌మీడియా ఆమె భ‌ర్త ఫోన్‌ను చూస్తుండ‌గా కాలిగి బేండేజ్ వేసుకున్న ఓ ఫొటో చూసి ఆమె అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. అస‌లు ఎందుకు కాలికి గాయ‌మైంది అనేది పూర్తిగా తెలియ‌లేదు. ఉద‌యం వ్యాయామం చేస్తుండ‌గా కాలి బెణికి వుంటుంద‌ని అభిమానులు అనుకోవ‌డం విశేషం. ఏదైనా సెల‌బ్రిటీ అయిన్పుడు మెగా కుటుంబం ఆడ‌ప‌డుచు అన్నాక అభిమానుల్లో ఆ మాత్రం ఆస‌క్తిక‌ల‌గ‌మాన‌దు. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌గ‌ల‌వు.