శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (19:15 IST)

తాగుబోతు రమేష్‌కు పక్కన బెట్టేశారు.. జబర్దస్త్ షోలో ఇక..?

Thagubothu ramesh
కరోనా కారణంగా లాక్ డౌన్ తర్వాత మొదలైన జబర్దస్త్‌లో చాలా మార్పులు జరిగాయి. అందులో కొన్ని టీమ్స్ ఎగిరిపోయాయి. మరికొన్ని టీమ్స్ కొత్తగా వచ్చాయి. అందులో రమేష్ టీం కూడా ఉంది. అప్పటి వరకు లేని ఆయన కొత్తగా కామెడీ షోలోకి వచ్చాడు. వచ్చి బాగానే నవ్వించాడు కూడా. మొదట్లో తాగుబోతు రమేష్ టీమ్‌కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు.
 
మొదటి నాలుగైదు వారాలు ఒక్కసారి కూడా పర్ఫార్మర్ ఆఫ్ ది వీక్‌గా నిలవలేదు. కానీ ఆ తర్వాత బాగానే నవ్వించాడు. అయితే జబర్దస్త్‌లో ఇప్పుడు ఈయనకు ఘోర అవమానం జరిగింది. సీనియర్ కమెడియన్ అని కూడా చూడకుండా ఆయన్ని తీసేసారు. తాజాగా తాగుబోతు రమేష్ టీం జబర్దస్త్‌లో లేదు.
 
ఆయన స్థానంలో మరో టీమ్ లీడర్ వచ్చాడు. నచ్చినట్లుగా పర్ఫార్మెన్స్ చేయడం లేదనే నెపంతో ఈయన్ని పూర్తిగా పక్కనబెట్టేసారు నిర్వాహకులు. అందులో భాగంగానే తాగుబోతు రమేష్‌ ఇప్పుడు టీమ్ లీడర్ కాదు. ఆయన కంటెస్టెంట్‌గా మారిపోయాడు.