మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (17:07 IST)

వీధి కుక్కపిల్లను దత్తత తీసుకున్న సోనూసూద్ కుమారుడు..

Sonu sood son
కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఎంతోమంది వలసకూలీలను తమ స్వస్థలాలకు చేర్చడంతో పాటు ఆపదలో ఉన్నవారికి సహాయం చేశాడు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌. దీంతో కరోనాలో పేదలకు ఆపద్భాంధవుడిగా నిలిచాడు. ఇంకా కూడా ఆపదలో వున్నవారికి కాదనకుండా సాయం చేస్తున్నాడు. 
 
తాజాగా ఓ కుక్క పిల్లను అక్కున చేర్చుకున్నాడు రియల్‌ హీరో. జంతు ప్రేమను చాటుకున్న సోనూసూద్‌ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. మనుషులకే కాదు మూగజీవాలకు కష్టం వస్తే ఆదుకోవడంలో సోనూ ఎప్పుడూ ముందుంటాడని ప్రశంసిస్తున్నారు. 
 
'నా కొడుకు అలీబాగ్ వీధుల్లో ఒంటరిగా ఉన్న ఈ కుక్క పిల్లను దత్తత తీసుకున్నాడు. ఆ కుక్క పిల్లకు నరుటో అని పేరుపెట్టామని' సోనూసూద్‌ ట్వీట్‌ చేశాడు. తన తనయుడు కుక్కపిల్లను ఎత్తుకొని ఉండగా పక్కనే ఉండగా తీసిన ఫొటోను ట్విటర్లో పోస్ట్‌ చేశాడు. ఆ పోస్ట్‌కు ఇప్పటికే 45వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.