శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 అక్టోబరు 2021 (11:59 IST)

నిన్నే పెళ్లాడతాకు నేటికి పాతికేళ్లు: అలా ఈ సినిమా మొదలైంది..

Ninne pelladuta
నాగార్జున హిట్ మూవీ 'నిన్నే పెళ్లాడతా'. ఈ చిత్రం విడుదలై నేటికి పాతికేళ్లు అవుతుంది. సినిమాలో బంధాలు వాటి అనుబంధాలను దర్శకుడు కృష్ణవంశీ చక్కగా చూపించాడు. అయితే, తాజాగా ఈ సినిమా విశేషాలను కృష్ణవంశీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
 
'నిన్నే పెళ్లాడతా' సినిమా అంత గొప్పగా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం.. సినిమాలో పాత్రలు చాలా సహజంగా ఉంటాయి. నాగార్జునగారు సినిమాలో ఎలా కనిపించారో.. నిజ జీవితంలోనూ అలాగే ఉంటారు. అందుకే, ఆయన ఎక్కడా నటిస్తోన్నట్లు అనిపించదు. పైగా రియల్‌ లైఫ్‌‌లోని సహజత్వం నాగార్జున గారి పాత్రలో బాగా ఎలివేట్ అయ్యాయి. అందుకే ఆ సినిమా ఆయనకు అంత గొప్ప పేరు తీసుకొచ్చింది అని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.
 
కృష్ణవంశీకి తకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలని, రావాలని కోరుకున్నాడు. ఆ ఆలోచనలో నుంచి అనేక కథలు రాసుకున్నాడు. ఇప్పటి వరకూ ఆర్జీవీ టచ్‌ చేయని ఫ్యామిలీ జోనర్‌‌లో ఓ మంచి ఎమోషనల్ కామెడీ ఎంటర్ టైనర్ చేయాలని నిర్ణయించుకుని కథ రాసుకున్నాడు. నాగ్‌కి కథ చెబితే ఓకే అన్నాడు. అలా ఈ సినిమా మొదలైంది. ఈ సినిమా షూట్ చేస్తోన్న సమయంలోనే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ బాగా నమ్మేవారట.
 
అయితే, ఈ సినిమా విజయం వెనుక ఉన్న మరో వ్యక్తి 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి. ఆయన ఒక్క పాట మినహా మిగిలిన అన్ని పాటల్ని ఎంతో ఇష్టపడి అద్భుతంగా రాశారు. 'సిరివెన్నెల' సాహిత్యం కారణంగా సినిమా జనంలోకి బాగా వెళ్ళింది.