1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (08:56 IST)

`మా` ముక్క‌లు కాదు - మోహ‌న్‌బాబు ఏడ్చేంత‌గా తిట్ట‌లేదు

Tv charcha gosti
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ రెండు ముక్క‌లు అవుతుంద‌నేదానిలో వాస్త‌వంలేద‌ని ప్ర‌ముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు తేల్చిచెబుతున్నారు. ఈ విష‌య‌మై మొన్న టీవీ చ‌ర్చాగోష్టిలో నేరుగా నాగ‌బాబుతో మాట్లాడ‌న‌నీ, అప్పుడు ఆయ‌న అటువంటిది ఏమీలేద‌ని చెప్పార‌ని వివ‌రించారు. 
 
`మా`లో ఎన్నికైన ప్ర‌కాష్‌రాజ్ పేన‌ల్ మూకుమ్మ‌డి రాజీనామా గురించి బుధ‌వారంనాడు జ‌రిగిన చ‌ర్చా గోష్టిలో ఆయ‌న మాట్లాడారు. నిన్న జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో బెన‌ర్జీ ఏడ్చేశాడు. మా అమ్మ‌ను తిట్ట‌డాడ‌నీ, అలాగే త‌నీష్‌కూడా ఏడ్చేశాడు. కానీ అక్క‌డ జ‌రిగింది వేరు. నేను అక్క‌డే వున్నానంటూ చిట్టిబాబు వివ‌రించారు. 
 
అస‌లేం జ‌రిగిందంటే!
ఎన్నిక‌ల సంద‌ర్భంగా విష్ణు, ప్ర‌కాష్‌రాజ్ ఇద్ద‌రూ కౌంటింగ్ ద‌గ్గ‌ర వున్నారు. అధికారుల‌తో మాట్లాడుతున్నారు. ఆ స‌మ‌యంలో త‌నీష్ వ‌చ్చాడు. ఏదో చెప్ప‌బోయాడు. అది చూసిన మోహ‌న్‌బాబు .. ఏయ్‌.. నీ కేంటి సంబంధం. వారిద్ద‌రూ మాట్లాడుకుంటున్నారుక‌దా.. దొబ్బెయ్ ఇక్క‌డ‌నుంచి అని అన్నాడు. ఇది చూసిన బెన‌ర్జీ కూడా వ‌చ్చి విష్ణుతో ఏదో మాట్లాడాల‌ని వ‌చ్చాడు, నీకేం ప‌ని ఇక్క‌డ మేం మాట్లాడుతున్నాంక‌దా అని విష్ణు అన్నారు. అదికాదు బాబూ.. అంటూ విష్ణు చేయిప‌ట్టుకుని ఏదో చెప్ప‌బోయాడు బెన‌ర్జీ.. ఇదంతా గ‌మ‌నిస్తున్న‌ మోహ‌న్‌బాబు వ‌చ్చి కొద్దిగా ప‌రుషంగా మాట్లాడాడు. ఇదీ జ‌రిగింది. దానికి ఏదో ఘోరం జ‌రిగింద‌నీ, మీడియా ముందు ఏడ్చేయ‌డం క‌రెక్ట్ కాదు. అక్క‌డ ఏడ్చేసిన‌వారు వెంట‌నే ఓ టీవీ ఛాన‌ల్ వెళ్ళిన‌ప్పుడు హాయిగా న‌వ్వుతూనే స‌మాధానం చెప్పారుక‌దా. అని చిట్టిబాబు తెలిపారు.
 
న‌టీన‌టులు ఏక్ట‌ర్లే. కానీ. ఇంత‌లా ఏక్ట్ చేయ‌న‌వ‌స‌రంలేదు. ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లో వీరు న‌టులు.. ఏదైనా చేయ‌గ‌ల‌ర‌నే విమ‌ర్శ వుంది. గెలిచినా ఓడినా అంతా క‌లిసి ప‌నిచేస్తామ‌న్న‌వారు ఇలా రెండో రోజే వీధికెక్క‌డం బాగోలేద‌ని.. ఛాంబ‌ర్ మాజీ కార్య‌ద‌ర్శి ప్ర‌స‌న్న‌కుమార్ తెలిపారు. సీనియ‌ర్ విశ్లేష‌కుడు ల‌క్ష్మ‌ణ‌రావు మాట్లాడుతూ, ప్ర‌కాష్ రాజ్ వెనుక నుంచి న‌డిపిస్తున్న మెగా ఫ్యామిలీ ముందుకు వ‌చ్చి అన్నింటికీ స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం వుంద‌ని తెలిపారు.
 
సీనియ‌ర్ విశ్లేష‌కుడు శ‌క్తిమాన్ తెలుపుతూ, అస‌లు పోటీలో ప్ర‌కాష్‌రాజ్ కంటే శ్రీ‌కాంత్ అధ్య‌క్షుడిగా వుండి, ప్ర‌కాష్‌రాజ్‌ను వైస్ ప్రెసిడెంట్‌గా పోటీకిదింపితే బాగుండేద‌నీ, గెలిచిన త‌ర్వాత స‌భ్యుల‌ను అవ‌మానించేవిధంగా రాజీనామా చేయ‌కుండా. అందులోనే వుండి ప్ర‌శ్నిస్తే బాగుంటుంద‌ని సూచించారు.