శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (20:37 IST)

విదేశాల్లో సిద్ధార్థ్ కు స‌ర్జ‌రీ - రాగానే కలుస్తాడు

Siddharth
హీరో సిద్ధార్థ్‌కు లండ‌న్‌లో స‌ర్జ‌రీ జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని మ‌హా స‌ముద్రం ద‌ర్శ‌కుడు అజయ్ భూపతి వెల్ల‌డించాడు. ఈ చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆయ‌న కూడా రావాల్సివుంది. కానీ స‌ర్జ‌రీ నిమిత్తం విదేశాల్లో వుండ‌డం వ‌ల్ల రాలేక‌పోయాడ‌ని ఆయ‌న పేర్కొన్నారు. మ‌హాస‌ముద్రం షూటింగ్‌లో ఏదైనా గాయ‌మైందా. లేదా హిందీ సినిమా షూటింగ్‌లో ఏదైనా జ‌రిగిందా? అనేది క్లారిటీలేదు. కానీ వ్య‌క్తిగ‌త ఆరోగ్య‌రీత్యానే స‌ర్జ‌రీవ‌ర‌కు వెళ్ళింద‌ని తెలుస్తోంది. సూచాయిగా ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు తెలియ‌జేశాడు. 
 
ఇక ఆయ‌న రాగానే త్వ‌ర‌లో మ‌ర‌లా మ‌హాసముద్రం టీం మొత్తం క‌లిసి సెల‌బ్రేష‌న్ చేసుకుంటామ‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నాడు. ఈ సినిమాపై పూర్తి న‌మ్మ‌కంతో వున్నామ‌ని తెలిపాడు. మ‌హాభార‌త క‌థ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా నిర్మించారు. ఇందులో శ‌ర్వానంద్‌, సిద్దార్థ్ అన్న‌ద‌మ్ములా. లేక స్నేహితులా అనేది చెప్ప‌కుండా సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందేన‌ని అజయ్ భూపతి అంటున్నాడు. ఇందులో `మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా` అంటూ సిద్ధార్థ్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాను ఎమోషనల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు దర్శకుడు అజయ్ భూపతి.