గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 2 నవంబరు 2018 (20:15 IST)

బాల‌య్య ఆ గెట‌ప్‌లో క‌నిపిస్తాడా..?

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం హైద‌రాబాదులో బాల‌య్యపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హా నాయ‌కుడు అని రెండు పార్టులుగా ఈ సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. స్వ‌ర‌వాణి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని నంద‌మూరి బాల‌కృష్ణ ఎన్.బి.కె బ్యాన‌ర్ పైన నిర్మిస్తుండ‌డం విశేషం. 
 
ఇదిలాఉంటే... ఈ మూవీ టీమ్ ఇటీవ‌ల పండ‌గ వ‌చ్చినా రాక‌పోయినా స‌రే.. బాల‌య్య గెట‌ప్స్ రివీల్ చేస్తూ ఆడియ‌న్స్‌లో అంచ‌నాల‌ను పెంచేసాయి. ఇక దీపావ‌ళికి కూడా ఓ గెట‌ప్ రిలీజ్ చేయ‌నున్నారు అని టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ ఆ గెట‌ప్ ఏంటంటే.. బాల‌య్య అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్ అని టాక్ వినిపిస్తోంది. 
 
అవును.. ఎన్టీఆర్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర చేయాల‌నుకున్నారు కానీ.. సూప‌ర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర చేయ‌డంతో ఎన్టీఆర్ అల్లూరి సినిమా చేయ‌లేదు కానీ.. మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమాలో అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్‌లో క‌నిపించి ఆ కోరిక‌ను తీర్చుకున్నారు. మ‌రి... అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్‌లో బాల‌య్య ఎలా ఉంటారో చూడాలి.