గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2023 (16:18 IST)

మెగా నిర్మాత నాగబాబు ప్రారంభించిన రైటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలుగు టెలివిజన్‌ కార్యాలయం

Nagababu with writers team
Nagababu with writers team
తెలుగు టెలివిజన్‌ కోసం గతంలోనూ ప్రస్తుతం వ్రాస్తున్న రచయితలందరూ వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్నదే రైటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలుగు టెలివిజన్‌ (వాట్‌). ప్రఖ్యాత సినీ, టీవీ రచయిత డా. సాయిమాధవ్‌ బుర్రాగారు హైదరాబాద్‌ పుప్పాలగూడలోని తన ఆపీసును ‘వాట్‌’కు ఉచితంగా ఇచ్చారు. శుక్రవారంనాడు కార్యాలయాన్ని మెగా నిర్మాత, రచయిత, నటుడు నాగబాబు ప్రారంభించారు. ఇందులో ఆయన సభ్యత్వం కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, రచయితలకు ఆరోగ్యభీమా పథకం అమలు చేద్దామనీ దానికి తోడ్పాటునిస్తానని హామీ ఇచ్చారు. వందమందికిపైగా వున్న ఈ అసోసియేషన్‌లో అందరూ పాల్గొని జయప్రదం కావించారు. 
 
పెద్దల ఆధ్వర్యంలో ప్రభుత్వ పెద్దలను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటామని అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జి. శశాంక, అధ్యక్షులు కొమ్మనాపల్లి గణపతివారు ఈ సందర్భంగా తెలియజేశారు. త్వరలో సీనియర్‌ రచయితలను కూడా కలిసి సభ్యత్వం తీసుకుని, వృద్ధ రచయితలకు అండగా వుండాలనీ, ప్రస్తుతం టీవీలకు రాస్తున్న అందరినీ ఏకదాటిపై తీసుకువచ్చి వారి సమస్యలకు కార్యాచరణ చేస్తామని ఫౌండర్‌ ప్రెసిడెంట్‌ ఉషారాణి, అడ్వయిజర్‌ రవికొలికపూడి, కార్యవర్గం సభ్యులు అంజన్‌, ప్రభు, వెంకటేష్‌బాబు, మహేంద్రవర్మ, ఫణికుమార్‌, రామారావు తెలియజేశారు.