శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (22:19 IST)

కాబోయే భర్తను పరిచయం చేసిన జబర్దస్త్ పవిత్ర

Pavitra
Pavitra
ఒకవైపు జబర్దస్త్ షో అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ, యూట్యూబ్ ఛానల్‌ను రన్ చేస్తున్న పవిత్ర బాగానే సంపాదిస్తోంది. తాజాగా ఈమె తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. 
 
తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఒక రొమాంటిక్ డాన్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సంతోష్ అనే వ్యక్తిని పవిత్ర పెళ్లి చేసుకోబోతోంది.

ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఇంకా పెళ్లి తేదీ ఖరారు కాలేదు. ప్రస్తుతం ఈ జంట లవర్స్‌గా ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా పవిత్ర ఒక వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.