శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (22:05 IST)

ఆ సమయంలో ఏడ్చాను.. బరువు తగ్గమంటే..?: నటి మహాలక్ష్మి

Mahalakshmi
కోలీవుడ్ సీరియల్ నటి మహాలక్ష్మి, నిర్మాత రవీందర్ దంపతుల గురించి తెలియని వారు ఉండరు. అయితే వారిద్దరూ పెళ్లి చేసుకున్నాక సోషల్ మీడియాలో ఈ జంటపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఎందుకంటే రవీందర్ చాలా లావుగా ఉంటాడు. మహాలక్ష్మికి ఇది రెండో పెళ్లి. దీంతో మహాలక్ష్మి డబ్బు కోసమే రవీందర్‌ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ జంట గురించి మరో వార్త వైరల్ అవుతోంది. 
 
ఓ ఇంటర్వ్యూలో మహాలక్ష్మి మాట్లాడుతూ.. "మా పెళ్లి సందర్భంగా చాలామంది మమ్మల్ని ట్రోల్ చేశారు. కానీ అవన్నీ పట్టించుకోలేదు. మా ఆయన్ని బరువు తగ్గమని చెబుతూనే ఉన్నాం కానీ పట్టించుకోవడం లేదు. ఆ సమయంలో ఏడ్చాను. నేనేమీ చేయలేను. అతని కోసం నేను కూడా బరువు పెరుగుతున్నాను. 
 
నేను నిద్రపోతున్నప్పుడు వచ్చి అన్నం ఎక్కువ తినడానికి నన్ను లేపుతారు. అంతేకాదు తినడం మొదలు పెట్టాక కూడా చాలా తింటాను.. అందుకే పరిమితమైన డైట్ కూడా మిస్సవుతున్నాను. ఇలా తింటూ వుంటే ఏదో ఒకరోజు రవీందర్ లా లావు అవుతాను. రవీందర్ కి కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి" అంది మహాలక్ష్మి బాధగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.