శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (15:55 IST)

నిలకడలేని విజయకాంత్ ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ రిలీజ్

Vijayakanth
తమిళ సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యం క్లిష్టంగా మారింది. గత 24 గంటలుగా ఆయన ఆరోగ్యంలో నిలకడ లేదని మియాట్ ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన స్థానిక రామావరంలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. ఇదే విషయంపై మియాట్ ఆస్పత్రి వైద్యులు ఒక హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. 
 
ఇందులో.. విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని, నిన్నటివరకు ఆయన బాగానే ఉన్నారని, అయితే, గత 24 గంటల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం నిలకడ లేదని చెప్పారు. ప్రస్తుతం ఆయనకు పల్మనరీ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరో 14 రోజుల పాటు ఆయనకు ఆస్పత్రిలో నిరంతర చికిత్స అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. 
 
మరోవైపు, డీఎండీకే పార్టీ కూడా విజయకాంత్ ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసింది. సాధారణ వైద్య పరీక్షల కోసమే విజయకాంత్‌ను ఆస్పత్రిలో చేర్చామని తెలిపింది. ఒకటి రెండు రోజుల్లో ఆయన ఇంటికి తిరిగి వస్తారని తెలిపింది. పైగా, ఆయన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మొద్దంటూ విన్నవించిన విషయం తెల్సిందే.