ఆదివారం, 3 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2024 (10:54 IST)

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

Rajendra-gayatri
Rajendra-gayatri
ప్రముఖ నటులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. శ్రీమతి గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటనలో పేర్కొన్నారు.
 
నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఎన్.టి.ఆర్. సంతాపన్ని ప్రకటించారు.
 
అదేవిధంగా చలనిచిత్రరంగలో ప్రముఖులంతా ఈ వార్త విని షాక్ కుగురయ్యారు. రాజేంద్రప్రసాద్ కు మనోధైర్యం ఆ దేవదేవుడు ఇవ్వాలని పలువురు సంతాపం తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వేరు వేరు ప్రకటనలో సానుభూతిని తెలియజేశారు.