మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 మే 2021 (18:56 IST)

వకీల్ సాబ్‌ అయ్యింది.. ఇక లెక్చరర్ పాత్రలో పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత 'వకీల్ సాబ్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమాకు తెలుగు రీమేక్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
 
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ తో 'హరి హర వీరమల్లు' సినిమాతో బిజీగా ఉన్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్‌ తో #PKPS28 ను డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసింది. 
 
ఈ చిత్రంలో పవన్ పాత్ర గురించి ఓ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో లెక్చరర్ పాత్రను పోషించబోతున్నారంట. 'వకీల్ సాబ్' సినిమాలో లాయర్‌గా కనిపించిన పవన్‌ను.. హరీష్ శంకర్ లెక్చరర్‌గా చూపించబోతున్నాడంట. ప్రస్తుతం ఈ వార్తపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.