డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా చూడాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు... ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందేనంటూ నవదీప్‌ను ఆదేశించింది.
దీంతో నవదీప్‌కు 41ఏ సీఆర్పీ కింద పోలీసులు నేడో రేపో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన విచారణకు హాజరుకాకుంటే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. నవదీప్‌తో పాటు మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
కాగా, ఈ డ్రగ్స్ దందా కేసులో నవదీప్ పేరు కూడా వినిపించింది. దీంతో ఆయన అరెస్టు కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. పైగా, ఈ కేసు విచారణకు సహకరించాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 41కే కింద పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని పోలీసులకు సూచించింది.