బాలీవుడ్ డైరెక్టర్ తనయుడితో డేటింగ్ చేస్తున్న జిగేల్ రాణి

Pooja Hegde
ఠాగూర్| Last Updated: బుధవారం, 15 జనవరి 2020 (15:35 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో జిగేల్ రాణిగా మంచి పేరుతెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. తెలుగు చిత్రపరిశ్రమలో వరుసబెట్టి చిత్రాలు చేస్తోంది. 'ముకుంద' చిత్రం ద్వారా ఈ అమ్మడు వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటిస్తోంది.

అల్లు అర్జున్ సరసన "డీజే", ఎన్టీఆర్‌తో "అరవింద సమేత", మహేష్‌ బాబు సరసన "మహర్షి" , వరుణ్‌తో "వాల్మీకి" చిత్రాల‌లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. తాజాగా "అల వైకుంఠ‌పుర‌ములో" న‌టించిన‌ పూజా త‌న గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో అమ్మ‌డి క్రేజ్ మ‌రింత పెరిగింది.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చిత్రంతో బిజీగా ఉన్న పూజా.. బాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ వినోద్ మెహ్రా త‌న‌యుడు రోహ‌న్ వినోద్ మోహ్రాతో డేటింగ్ చేస్తున్న‌ట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. 2018లో వచ్చిన బ‌జార్ చిత్రంతో లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన రోహ‌న్ త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. గ‌త కొద్ది రోజులుగా రోహ‌న్, పూజాలు డేటింగ్‌లో ఉన్న‌ట్టు బాలీవుడ్ కోడై కూస్తోంది. ఈ పుకార్లపై ఈ అమ్మడు మాత్రం స్పందించడం లేదు.దీనిపై మరింత చదవండి :