కోలీవుడ్‌లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న పూజా హెగ్డే
కన్నడ ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఒకపుడు టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ అవకాశాలు సన్నగిల్లాయని చెప్పొచ్చు. మరోవైపు, తాజాగా కోలీవుడ్‌లోనూ ఈ భామ బిజీగా మారిపోతున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "కూలీ" చిత్రంలో ఆమె నటిస్తున్నారు. ఆమె లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 'కూలీ' మూవీలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ చేశారు.
సన్ పిక్చర్స్ నిర్మించే ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, అమీర్ ఖాన్, శృతిహాసన్ వంటి నటీనటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. మరోవైపు, కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన నాయగన్ చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.