గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2024 (23:17 IST)

2026 ఎన్నికలు - విజయ్ తమిళనాడు సీఎం అవుతారా?

Vijay
Vijay
సినిమా నుంచి రాజకీయాలకు రావడం సినీ తారలకు కొత్తేమీ కాదు. దక్షిణ భారతదేశంలో ఈ తంతు చాలాకాలంగా జరుగుతూనే వుంది. ముఖ్యంగా తమిళనాడులో, చలనచిత్ర తారలు శక్తివంతమైన రాజకీయ నాయకులుగా ఎదిగిన దాఖలాలు ఎన్నో వున్నాయి. 
 
ఎంజీఆర్ తమిళ చిత్రసీమలో రాణించి.. ఆ కాలంలో కరుణానిధితో విభేదాల తర్వాత డిఎంకెతో విడిపోయి ఎడిఎంకె (తరువాత ఎఐఎడిఎంకె)ను స్థాపించారు. ఎంజీఆర్ వారసత్వాన్ని జయలలిత ముందుకు తీసుకువెళ్లారు. తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇలా భాగ్యరాజ్, శరత్ కుమార్, విజయకాంత్ లాంటి నటులు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే వీరు పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. 
 
విజయ్‌కు అనుకూలంగా రాజకీయాల్లో అనేక అంశాలు పని చేయవచ్చునని విశ్లేషకులు అంటున్నారు. అవేంటంటే..  బలమైన వ్యతిరేకత లేకపోవడం, జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకే బలహీనపడటం, ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే స్వల్ప ప్రతిఘటనను ఎదుర్కోవడంతో విజయ్ టీవీకే పార్టీకి 2026లో మంచి భవిష్యత్తు వుంటుందని.. అలాగే విజయ్ సీఎం అయ్యే ఛాన్సులు కూడా లేకపోలేదని టాక్ వస్తోంది.