మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 1 జులై 2021 (16:07 IST)

నిర్మాణానంత‌ర ప‌నుల్లో శివాని న‌టించిన‌ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’

Sivani -www
`118` వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫస్ట్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ తెలుగు మూవీ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’(హూ వేర్ వై). అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌, అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజైన‌ టీజ‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ రోజు (జులై 1) హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమె స్పెష‌ల్  బ‌ర్త్‌డే పోస్ట‌ర్ ని విడుద‌ల‌చేసి శుభాకాంక్ష‌లు తెలిపింది చిత్ర యూనిట్‌. ఈ మూవీలో `మిత్ర` అనే పాత్ర‌లో శివాని న‌టిస్తున్న‌ట్లు తెలిపారు మేక‌ర్స్‌. ఆహ్లాద‌క‌రంగా ఉన్న ఈ స్పెష‌ల్ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా..
 
చిత్ర నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల  మాట్లాడుతూ, ఈ మూవీలో శివానీ `మిత్ర` అనే పాత్ర‌లో న‌టించారు. చాలా ఛాలెంజింగ్ పాత్ర అయిన‌ప్ప‌టికీ త‌న న‌ట‌న‌తో పూర్తిన్యాయం చేశారు. గుహ‌న్ గారి స్టైలిష్ మేకింగ్‌, అదిత్, శివానిల అద్భుత‌మైన న‌ట‌న డెఫినెట్‌గా ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి`` అన్నారు.
 
కో–ప్రొడ్యూసర్ విజయ్‌ ధరణ్‌ దాట్ల మాట్లాడుతూ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ ఫస్ట్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ తెలుగు మూవీ ఇది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్స్  ముగింపుద‌శ‌కు వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే థీమ్ సాంగ్‌ని రిలీజ్ చేసి కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తాం`అన్నారు.
 
అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి..
బ్యానర్‌: రామంత్ర క్రియేషన్స్
సంగీతం: సైమన్‌ కె. కింగ్,
ఎడిటింగ్‌: తమ్మిరాజు,
ఆర్ట్‌: నిఖిల్‌ హాసన్
డైలాగ్స్‌: మిర్చి కిరణ్,
లిరిక్స్‌: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, రోల్‌రైడా
కొరియోగ్రఫి: ప్రేమ్‌ రక్షిత్,
స్టంట్స్‌: రియల్‌ సతీష్,
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: పొన్మని గుహన్
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: కె. రవి కుమార్,
కో–ప్రొడ్యూసర్‌: విజయ్‌ ధరణ్‌ దాట్ల,
నిర్మాత: డా. రవి పి.రాజు దాట్ల,
కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్