సోమవారం, 25 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 మే 2023 (16:38 IST)

లిల్లీ సినిమాలోని సాంగ్‌ను విడుదల చేసిన ప్రభాస్‌

lilly song- prabhas
lilly song- prabhas
మొట్టమొదటి పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మొట్టమొదటి చిన్నపిల్లల పాన్‌ఇండియా  సినిమా  ‘లిల్లీ’ సినిమాలోని ‘‘బూచోడమ్మ బూచోడు...’’ అనే పాటను తన సోషల్‌మీడియాద్వారా మంగళవారం విడుదల చేశారు. నేహ మ్యూజిక్‌ ద్వారా ఈ సినిమా పాటలు విడుదలవుతున్నాయి. బేబి ‘నేహ’, ‘ప్రణతి రెడ్డి’, మాస్టర్‌ వేదాంత్‌ వర్మలు నటించిన ‘లిల్లీ’ సినిమాలో రాజ్‌వీర్‌ కీలకపాత్రలో నటించారు. గోపురం స్టూడియోస్‌ నిర్మించిన ఈ చిత్రానికి కె.బాబురెడ్డి, జి. సతీష్‌కుమార్‌లు నిర్మాతలు. మొట్టమొదటి చిత్రంతోనే పాన్‌ఇండియా దర్శకునిగా శివమ్‌ ‘లిల్లీ’ సినిమాతో పరిచయం అవుతున్నారు.
 
 దర్శకుడు శివమ్‌ మాట్లాడుతూ–‘‘ శ్రీదేవి బాలనటిగా నటించిన ‘‘బడిపంతులు’’ చిత్రంలో ‘‘బూచోడమ్మా బూచోడు..బుల్లిపెట్టెలో ఉన్నాడు..’’ అనేపాట అందరికి గుర్తుండే ఉంటుంది కదా. ఇప్పుడు మా ‘లిల్లీ’ సినిమాలోని ‘‘బూచోడమ్మ...’’పాటను చూసినప్పుడు కూడా ఖచ్చితంగా శ్రీదేవి గారు  గుర్తుకు రావటం ఖాయం’’ అన్నారు. ప్రముఖ నటుడు శివకృష్ణ  మాట్లాడుతూ–‘‘ మా సినిమాలోని ఈ పాటను విడుదల చేసినందుకు ప్రభాస్‌ గారికి కృతజ్ఞతలు లె లియచేస్తున్నా’’ అన్నారు.