బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2024 (13:53 IST)

శివం భజే తో దర్శకుడుగా అప్సర్‌పై ప్రశంసలు

director Apsar
director Apsar
మిలిటరీ నుంచి సినిమా దర్శకుడిగా పరిచయం అయిన వ్యక్తి అప్సర్. సోల్జర్ గా తన అనుభవాలతో గంధర్వ చిత్రాన్ని తీసి పర్వాలేదు అనిపించిన అప్సర్ తాజాగా శివం భజే సినిమా తీశారు. ఈ సినిమా మంచి టాక్ రావడంతో దర్శకుడిగా అందరినీ ఆకట్టుకున్నాడు. కథ కథనంతో పాటు అశ్విన్ బాబు నటించిన విధానం, సాంకేతిక తో  శివం భజేతో మైమరిపించాడు. ఆగస్ట్ 1న విడుదలైన ఈ చిత్రానికి అంతటా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
 
అశ్విన్ బాబు గత చిత్రం హిడింబ విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్న సంగతి తెలిసిందే. శివం భజే చిత్రాన్ని ఒక యూనిక్, డివోషనల్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. మాస్‌ను మెప్పించే యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా అన్ని జానర్లను మిక్స్ చేసి తీసిన ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ స్పందన వస్తోంది.
 
అప్సర్ దర్శకత్వం, మేకింగ్, ఎంటర్టైన్, ఎంగేజ్ చేయడంలో అప్సర్ పాస్ అయ్యాడని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాతో అప్సర్ కాంప్లెక్స్ సబ్జెక్ట్‌లను కూడా ఎంతో సులభంగా, తన టాలెంట్‌తో తీయగలడని నిరూపించుకున్నారు. అతని రైటింగ, మేకింగ్, టేకింగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రాన్ని మహేశ్వర్ రెడ్డి నిర్మించగా, మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది.