మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2017 (14:04 IST)

మోడల్ ప్రీతీ జైన్‌కు 12 ఏళ్ల తర్వాత మూడేళ్ల జైలు శిక్ష

మోడల్ ప్రీతీ జైన్‌కు 12 ఏళ్ల తర్వాత హత్యాయత్నం కేసులో సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు విధించింది. ప్రముఖ బాలీవుడ్ డైరక్టర్ మధుర్ భండార్కర్‌పై హత్యాయత్నం కేసులో మోడల్ ప్రీతి జైన్‌ నిందితురాలు. 2004లో మధుర్

మోడల్ ప్రీతీ జైన్‌కు 12 ఏళ్ల తర్వాత హత్యాయత్నం కేసులో సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు విధించింది. ప్రముఖ బాలీవుడ్ డైరక్టర్ మధుర్ భండార్కర్‌పై హత్యాయత్నం కేసులో మోడల్ ప్రీతి జైన్‌ నిందితురాలు. 2004లో మధుర్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ప్రీతి జైన్ కేసు దాఖలు చేసింది. ఈ కేసును సుప్రీం  కోర్టు 2012లో కొట్టిపారేసింది. 
 
అలాగే 2005 సెప్టెంబరులో మధుర్‌ను హతమార్చాలని గ్యాంగ్‌స్టర్ అరుణ్ గావ్లీ అనుచరుడు నరేశ్ పర్దేశీతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రీతి రూ.75 వేలిచ్చినా పర్దేశీ ప్లాన్ మిస్ కావడంతో తన డబ్బు తిరిగివ్వాలని కోరింది. ఈ విషయాన్ని గ్యాంగ్‌స్ట‌ర్ అనుచ‌రులు పోలీసుల‌కు లీక్ చేయగా.. 2005 సెప్టెంబ‌ర్‌లో కేసు న‌మోదు చేసి.. ప్రీతిని కస్టడీలోకి తీసుకున్నారు.