ఆదివారం, 19 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2023 (08:50 IST)

త్వరలోనే నాలుగో చిత్రాన్ని ప్రారంభించనున్న నిర్మాత డా.నాగం తిరుపతి రెడ్డి

Producer Dr. Nagam Tirupathi Reddy bithday celebrations with Niranjan Reddy
Producer Dr. Nagam Tirupathi Reddy bithday celebrations with Niranjan Reddy
ఆది సాయి కుమార్‌తో తీసిన చిత్రం తీస్ మార్ ఖాన్.  మంచి ప్రశంసలు అందుకుని నిర్మాతగా మంచి పేరును తెచ్చిపెట్టింది డా.నాగం తిరుపతి రెడ్డికి.  సినిమా రంగంలోకి నిర్మాతగా అడుగు పెట్టడం అంటే సాహసం. కేవలం డబ్బులుంటే నిర్మాతగా మారొచ్చు అనుకుంటే పొరబాటే. సినిమాల మీద ప్యాషన్, మంచి కథలను ప్రేక్షకులకు అందించాలనే ఆసక్తి ఉంటేనే నిర్మాతగా రాణించగలుగుతారు. అలాంటి ఓ విజన్‌తోనే డా.నాగం తిరుపతి రెడ్డి ఇండస్ట్రీలోకి వచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు, విజన్ గ్రూప్ అధినేత  డా.నాగం తిరుపతి రెడ్డి గారి జన్మదిన వేడుకలను తన కార్యాలయంలో నిర్వహించారు. 
 
నాగం తిరుపతి రెడ్డి సతీసమేతంగా పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి వచ్చి శుభాకాంక్షలు తెలియజేసారు. వనపర్తి నియోజక వర్గం నుండి రాజకీయ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు. 2024 డైరీ, క్యాలండర్‌ను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. 
 
 అనంతరం డా.నాగం తిరుపతి రెడ్డి గారు మాట్లాడుతూ.. నిరంజన్ రెడ్డికి, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసారు. తాను ఇప్పటి వరకు చేస్తున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తానని, అందరికీ సేవ చేసే ఆ భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ సంవత్సరం నాలుగు వెంచర్లతో పాటు మంచి కంటెంట్ ఉన్న సినిమా కూడా చేస్తానని తెలిపారు. డైరెక్టర్, 100 కోట్లు, తీస్ మార్ ఖాన్ వంటి చిత్రాలతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగం తిరుపతి రెడ్డి త్వరలోనే తన నాలుగో ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.