1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (16:39 IST)

రాధా మాధవం సెన్సార్ పూర్తి. విడుదలకు సిద్ధం

Vinayak Desai - Aparna Devi
Vinayak Desai - Aparna Devi
గ్రామీణ ప్రేమ కథా చిత్రాలు ఈ మధ్య ఎక్కువగా రావడం లేదు. అచ్చమైన ప్రేమ కథను తెరపై చూసి చాలా కాలమే అవుతోంది. ప్రేమకు అర్థం చెప్పేలా ప్రస్తుతం ‘రాధా మాధవం’ అనే సినిమా రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. సతీష్ ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. చక్కని సందేశాత్మక చిత్రమని సినిమా మీద ప్రశంసలు కురిపించారు.
 
మార్చి 1న ఈ మూవీ భారీ ఎత్తున విడుదల కానుంది. ఇక మున్ముందు మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌తో చిత్రయూనిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
నటీనటులు : వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ,మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల తదితరులు