1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2023 (17:19 IST)

రాధా మాధవం టీమ్ కు సోహెల్ అభినందనలు

Sohel, Radha Madhavam team
Sohel, Radha Madhavam team
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న గ్రామీణ ప్రేమ కథా చిత్రంగా ‘రాధా మాధవం’ రాబోతుంది.  ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. రీసెంట్‌గా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేయించిన సంగతి తెలిసిందే.  అలానే ఈ మూవీ పోస్టర్‌ను డీపీఎస్ ఇన్‌ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డీ.ఎస్.ఎన్.రాజు రిలీజ్ చేశారు.
 
తాజాగా ఈ మూవీ నుంచి ఓ అదిరిపోయే ఫాస్ట్ మాస్ బీట్‌ను బిగ్ బాస్ సోహెల్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. 'నేల మీద నేను ఉన్నా' అంటూ సాగే ఈ పాటను వసంత్ వెంకట్ బాలా రాయగా.. వీఎం మహాలింగం, ఎంఎం మానసి ఆలపించారు. కొల్లి చైతన్య ఇచ్చిన బాణీ బాగుంది. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో చిత్రయూనిట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ నెలలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.
 
నటీనటులు : వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ,మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల తదితరులు