ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (17:16 IST)

కొత్త కాన్సెప్ట్‌తో సికాడా చిత్రం పోస్టర్ ఆవిష్కరించిన సోహెల్

Ravitheja Amaranarayana  Vandana menon  Chandoo mondeti Sreejith edavana
Ravitheja Amaranarayana Vandana menon Chandoo mondeti Sreejith edavana
కొత్త కాన్సెప్ట్‌తో పలకరించేందుకు ఒకే టైటిల్, ఒకే కథ, 4 విభిన్న భాషలు, 24 విభిన్న ట్యూన్స్‌తో రాబోతోన్న ‘సికాడా’ అనే చిత్రం రాబోతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను  ప్రముఖ దర్శకుడు చందూ మొండేటి, హీరో సోహెల్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్, నటీనటుల లుక్స్, గెటప్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
 
సికాడా యూనిట్‌లో అంతా కూడా కొత్త వారే. శ్రీజిత్ ఎడవనా దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. తీర్నా ఫిల్మ్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వందనా మీనన్, గోపకుమార్ పి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిత్ సిఆర్, గాయత్రి మయూర, జైస్ జోస్ ప్రధాన పాత్రలు పోషించారు. 
 
ఈ సినిమా షూటింగ్ బెంగుళూరు, అట్టపాడి, వాగమోన్, కొచ్చి తదితర ప్రాంతాల్లో జరిగింది. తెలుగు భాషలోనే కాకుండా కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రూపొందించారు.  
 
శ్రీజిత్ ఎడవనా మ్యూజిక్ డైరెక్టర్‌గా "కాదల్ ఎన్ కవియే",  "నెంజోడు చేరు" వంటి తమిళ, మలయాళ సినిమాలకు పని చేశారు. ఇప్పుడు సికాడాతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.
 
ఈ సినిమా పాటలకు రవితేజ అమరనారాయణ అద్భుతమైన సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి నవీన్ రాజ్ కొరియోగ్రాఫర్, శైజిత్ కుమారన్ ఎడిటర్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.
 నటీనటులు : రజిత్ సిఆర్, గాయత్రి మయూర, జైస్ జోస్