రాధేశ్యామ్ కొత్త పోస్టర్ విడుదలచేసిన మేకర్స్
ప్రభాస్‌తో పాటు హీరోయిన్ పూజా హెగ్డేల పోస్టర్లను ఇటీవల విడుదల చేశారు. నేడు ప్రభాస్ కొత్త లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రం మార్చి అనగా ఈనెల 11న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్లలో జాతకాలు చెప్పే పండితులను ఏర్పాటు చేశారు. ఈ సినిమాకు వచ్చే ప్రేక్షకులకు తగు విధంగా జాతకాలు చెప్పే ప్రయత్నాలు చేయడం విశేషం. అయితే ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాల్సిందే.
ఇక ఈ సినిమాకు వచ్చిన అప్‌డేట్స్‌తో రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. పూజా హెగ్డే పాత్ర చిత్ర కథ రోమియో జూలియట్ తరహాలోనే వుంటుందని దర్శకుడు రాధాకృష్ణ ఇటీవలే వెల్లడించాడు. మరోవైపు టైటానిక్ తరహాలో షిప్ ప్రయాణం, ప్రమాదం కూడా ట్రైలర్‌లో విడుదల చేశారు. గ్రీస్‌లో కథ ప్రకారం అలా చేయాల్సి వచ్చిందని కొన్ని పోలికలు వున్నా అవి ఈ సినిమాకు ఎంత మాత్రం బేరీజు వేయలేమని దర్శకుడు చెప్పారు. ఇదిలా వుండగా, తాజాగా ప్రభాస్‌కు సంబంధించిన మరో కొత్త లుక్‌ను సోషల్ మీడియాలో వదిలారు. ఈ లుక్ ప్రభాస్ అభిమానులనే కాకుండా అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది.