గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (19:59 IST)

రాఘవ లారెన్స్ కు అధికారం కావాల‌ట‌

Raghava Lawrence
కాంచ‌న‌తో దెయ్యం సినిమాల‌తో సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేసిన రాఘవ లారెన్స్ తన అభిమానులకు కొత్త విష‌యాన్ని తెలియ‌జేశాడు. ఏకంగా ‘అధికారం’ పేరుతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టు ప్రకటించాడు. విశేషం ఏమంటే ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ సమకూర్చుతున్నాడు.ఈ సినిమా నిర్మాణంలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నాడు. ఈ మూవీని దురై సెంథిల్ కుమార్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను గురువారం రాత్రి విడుదల చేశారు. 
 
ఫైవ్ స్టార్ కదిరేశన్ సంస్థలో ‘రుద్రన్’ తర్వాత మరోసారి నటించడం ఆనందంగా ఉందన్నాడు రాఘవ లారెన్స్. ఇంతవరకూ తెలుగు, తమిళ భాషలలో మాత్రమే దర్శకత్వం వహించిన లారెన్స్ గత యేడాది ‘కాంచన’ రీమేక్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాను అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ ‘లక్ష్మీ’ పేరుతో తెరకెక్కించాడు. కానీ దీనికి మిశ్రమ స్పందనే వచ్చింది. దాంతో ఇప్పుడీ నటన మీద మాత్రమే దృష్టి పెడుతున్నాడు. అలా యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అధికారం’ పాన్ ఇండియా మూవీగా ఈ యేడాది చివరిలో పట్టాలు ఎక్కబోతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.