శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్ ఆరంబాకం
Last Modified: బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (22:10 IST)

దాని కోసం నన్ను ప్రెగ్నెంట్‌ని చేసేస్తారా...

సినీ పరిశ్రమలో హీరోల విషయం ఎలా ఉన్నప్పటికీ... హీరోయిన్ల విషయం మాత్రం చాలా గుట్టుగానే ఉంటుంది... కొంత మంది హీరోయిన్లు తాము ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని కూడా బయటపెట్టరు. రీసెంట్ ఫొటోల్లో వాళ్ల ఆకారంలోని మార్పులను చూసి కొంతమంది ఆ విషయాన్ని ఊహిస్తారు.

చాలా సందర్భాల్లో అవి నిజమవుతుంటాయి కూడా. కొన్ని సందర్భాల్లో ఆ లెక్క తప్పే అవకాశమూ లేకపోలేదు. తాజాగా లక్ష్మీరాయ్ విషయంలోనూ అదే జరిగింది. తను గర్భవతినంటూ ఓ తమిళ మీడియా ప్రచురించిన ఆర్టికల్‌పై ఈ హాట్ బ్యూటీ విరుచుకుపడింది.
 
"మీ వ్యూలు, క్లిక్‌ల కోసం ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి స్టోరీలు రాసేస్తారా? అసలు ఇంత కాన్ఫిడెంట్‌గా ఆర్టికల్స్ ఎలా రాస్తున్నారు. ఈ వార్త ఎవరు రాసారో నాకు తెలీదు కానీ, అతడికి నేనంటే బొత్తిగా ఇష్టం లేనట్టుగా ఉంది. నన్ను అడిగితే ఇంతకంటే మంచి స్టోరీ ఇచ్చేదాన్ని" అంటూ సదరు తమిళ మీడియా సంస్థపై విరుచుకుపడింది లక్ష్మీరాయ్. ఈ వార్తని తన దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు చెబుతూనే.. దేనికైనా ఓ హద్దు ఉంటుందనీ, ఇకనైనా అర్థవంతమైన వార్తలు అందించమంటూ చురకలంటించింది.
 
వాస్తవానికి... లక్ష్మీరాయ్ గర్భవతి అయిందంటూ దాదాపు 3 రోజులుగా కథనాలు వస్తూనే ఉన్నాయి. ఆవిడ ఇటీవల నటించిన తన కొత్త సినిమా ప్రచారంలో భాగంగా ఆమె ఇచ్చిన ఓ బోల్డ్ స్టేట్‌మెంట్‌తో చాలామంది మీడియా ప్రతినిధులు అలా ఊహించేసుకున్నారు. గతంలో కూడా ఆమెపై ఇలాంటి పుకార్లు వచ్చినప్పటికీ... అప్పట్లో వాటిని రాయ్ లక్ష్మి సీరియస్‌గా తీసుకోలేదు. ఈసారి మాత్రం కొంచెం ఘాటుగానే సమాధానమిచ్చారు.
 
అయితే... కేవలం తన సినిమా ప్రమోషన్ కోసమే లక్ష్మీరాయ్ ఇలా సామాజిక మాధ్యమాలలో ఫైర్ అవుతున్నట్లు పలువురు గుసగుసలు పోతున్నారు.