శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జనవరి 2020 (14:00 IST)

అలనాటి నటుడు రాజ్‌కపూర్ కుమార్తె కన్నుమూత

బాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన అలనాటి నటుడు రాజ్‌కపూర్ కుమార్తె, శ్వేతా బచ్చన్ అత్తయ్య అయిన రీతూ నంద అనారోగ్యంతో చనిపోయారు. ఆమె వయసు 71 యేళ్లు. గత కొన్నేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన ఆమె... మంగళవారం తెల్లవారుజామున చనిపోయారు. ఈ విషయాన్ని అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌ణ్‌బీర్ సోద‌రి రిద్దిమా క‌పూర్ వెల్లడించారు.
 
కాగా, రితూ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారంలో ఈమె ఒక రోజులో 17 వేల పాలసీలు చేయించిన రికార్డు ఉంది. ఆ తర్వాత ఎస్కార్ట్స్ గ్రూప్ ఛైర్మ‌న్ రాజ‌న్ నంద‌ని వివాహం చేసుకున్నారు. ఈయన 2018లో మ‌ర‌ణించారు. అత్యంత మృదుస్వ‌భావి అయిన ఆమె మ‌ర‌ణం మ‌మ్మ‌ల్ని ఎంతో బాధిస్తుంది. ఆమె ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని రిద్ధిమా క‌పూర్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.