కోటశ్రీనివాసరావు రూటులో రాజేంద్రప్రసాద్
నటుడు రాజేంద్రప్రసాద్ విభిన్నమైన పాత్రలు పోషించారు. పిసినారిలో అత్యంత పిసినారి పాత్ర తెలుగువారికి గుర్తిండే పాత్ర కోటశ్రీనివాసరావు చేసిందే. `అహనా పెల్లంట`లో ఆయన చేసిన పాత్ర తీరు అలాంటిది. బట్టలు బదులు పేపర్ కట్టుకోవడం, అగ్గిపుల్లలు ఏరి వంట వండటంతోపాటు కోడిని ఎదురుగా వేలాడి తీసి ఉట్టి అన్నం తింటూ కోడికూర తిన్నంతగా తృప్తి చెందండం వంటివి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాయి. సమాజంలో ఇంత పిసినారి వారు వుంటారా అనేది సింబాలిక్‌గా దర్శకుడు జంథ్యాల చూపించారు. ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్ పిసినారి సంఘానికి అధ్యక్షునిగా నటించాడు. ఇప్పుడు ఆ సినిమాలో కోట పోషించిన పాత్ర రాజేంద్రప్రసాద్ పోషిస్తే? ఎలా వుంటందనే ట్విస్ట్ తో ఓ సినిమా రూపొందుతోంది. అదే `ఎఫ్3`.
ఎఫ్3ను దర్శకుడు అనిల్‌రావిపూడి సరికొత్తగా ఆవిష్కరించే పనిలో వున్నాడని సమాచారం. తనకు ఇష్టమైన జంథ్యాలగారి బాటలో ఆయన అనురిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌ను అతి పిసినారిగా చూపించబోతున్నాడట. నటుడిగా ఎవ్వరూ చేయనన్ని పాత్రలను చేసిన ఘనుడు రాజేంద్రప్రసాద్ అందుకే ఆ పాత్రను చేయడానికి చాలా ఆసక్తి చూపించాడు. ఆ పాత్రకు విభిన్నమైన గెటప్ కూడా వుంటుంది. కరోనా తర్వాత ఆయన పాత్ర ఎలా వుంటుంది? ఇతర వివరాలు దర్శకుడు తెలియజేనున్నారు.