సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 10 జనవరి 2019 (09:21 IST)

'బాషా'ను గుర్తు చేసిన 'పేట'... రజినీకాంత్ యాక్షన్ సూపర్బ్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం 'పేట'. ఈ చిత్రం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం 1990లో విడుదలైన 'బాషా' చిత్రాన్ని గుర్తుకు తెచ్చేలా ఉందని ఈ చిత్రాని చూసిన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో రజినీకాంత్ నటన సూపర్బ్ అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఈ మధ్యకాలంలో రజినీకాంత్ నటించిన 'కబాలి', 'కాలా', '2.0' చిత్రాలు వచ్చాయి. కానీ, ఇవేవి 1990 నాటి బాషాను గుర్తుకు తెప్పించలేకపోయాయి. కానీ, పేట మాత్రం ఆనాటి బాషాను గుర్తుకు తెచ్చేలా ఉందని వారు ట్వీట్స్ చేస్తున్నారు. 
 
ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బీజీఎం సూపరని అంటున్నారు. ఈ సినిమా రజినీకాంత్ స్టయిల్‌లో నడిచిన పక్కా మాస్ సినిమా అని, 'బాషా'ను మించిపోయిందని చెబుతున్నారు. 
 
రజనీ కామెడీ టైమింగ్, ఫైట్లు, మాస్ పాటలు... అభిమానులకు కావాల్సినవన్నీ ఉన్నాయని, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్ అని మరికొందరు ట్విట్టర్‌లో స్పందిస్తున్నారు. చాలాకాలం తర్వాత పాత తలైవా తిరిగి కనిపించాడని రజినీకాంత్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.