బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 నవంబరు 2019 (18:30 IST)

అలా టచ్ చేసేవాళ్లు తేడాగాళ్లే : రకుల్ ప్రీత్ సింగ్ (video)

తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం పెద్ద దుమారాన్నే రేపింది. ఈ అంశాన్ని బహిర్గతం చేసిన నటి శ్రీరెడ్డి. ప్రస్తుతం ఆమె తన మకాంను చెన్నైకు మార్చింది. దీనికి కారణం క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని వెలుగులోకి తేవడం వల్ల ఆమెకు బెదిరింపులు రావడంతో మకాంను చెన్నైకు మార్చిందనే టాక్ ఉంది. ఇదిలావుంటే, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలా టచ్ చేసేవాళ్లంతా తేడాగాళ్లేనంటూ వ్యాఖ్యానించింది. 
 
ఆదివారం విశాఖపట్టణంలో రన్ 555కే 2.0 వాక్ ముగింపు కార్యక్రమం జరిగింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. అక్కయ్యపాలెం దరిపోర్టు కళావాణి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రకుల్ మాట్లాడుతూ, చెడు స్పర్శకు, మంచి స్పర్శకు మధ్య తేడా ఏమిటో చిన్నారి బాలికల్లో అవగాహన కలిగించాలని, ఇది తల్లిదండ్రుల బాధ్యత అని హితవు పలికింది.
 
ముఖ్యంగా, చిన్నవయసు నుంచే అమ్మాయిలకు లైంగిక వేధింపుల పట్ల చైతన్యం వచ్చేలా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటి సమాజంలో అమ్మాయిలను అసభ్యకరమైన రీతిలో తాకేవాళ్లు ఎక్కువ అవుతున్నారని, ఆ విధంగా తాకేవాళ్లు తేడాగాళ్లేనని పేర్కొన్నారు. వారిని ముందే పసిగట్టి తక్షణమే ఫిర్యాదు చేయాలని తెలిపారు.