1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2022 (18:44 IST)

"ఆదిపురుష్" సైఫ్ అలీఖాన్ లుక్ నచ్చలేదు.. రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆదిపురుష్ టీజర్‌పై స్పందించాడు. ఆదిపురుష్‌లో వాస్తవానికి తనకు సైఫ్ అలీ ఖాన్ లుక్ నచ్చలేదని వర్మ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. రావణుడిగా పొడవాటి జుట్టు, భారీ ఆకారం, గంభీరమైన చూపులతో ఎస్వీ రంగారావును చూడ్డానికి అలవాటుపడ్డానని చెప్పారు.
 
ప్రస్తుతం "ఆదిపురుష్" టీజర్‌లో సైఫ్ అలీ ఖాన్‌ను చూశాక కొంచెం బాధగా అనిపించిందని, ఇదేంటి ఇలా ఉన్నాడు అనుకున్నానని వర్మ వివరించారు. తాము రామాయణాన్ని విభిన్నరీతిలో చూపిస్తున్నామని 'ఆదిపురుష్' చిత్రబృందం ముందే ప్రకటించి ఉంటే బాగుండేదని, అలా చెప్పకపోవడం వల్లే టీజర్ చూశాక ఈ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోందని అభిప్రాయపడ్డారు.
 
ఓ నిర్మాత కూడా తనకు ఫోన్ చేసి 'ఆదిపురుష్'లో రాముడేంటి మీసాలతో ఉన్నాడు అని అడిగాడని, అయితే రాముడ్ని మీసాలతో ఎందుకు చూపించకూడదన్నది చిత్రబృందం ఆలోచన అయ్యుంటుందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఆదిపురుష్ చిత్రబృందం ఆలోచన తప్పయితే అందుకు వాళ్లే మూల్యం చెల్లించుకుంటారని వర్మ పేర్కొన్నారు. 
 
మనది ప్రజాస్వామ్య దేశం అని, ఎవరు ఏదైనా చేయొచ్చునని వెల్లడించారు. నచ్చినవాళ్లు చూస్తారు, నచ్చనివాళ్లు చూడరు... అంతే తప్ప, ట్రోలింగ్ చేయడం సరికాదని హితవు పలికారు.