బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 మే 2017 (12:10 IST)

''గన్స్ అండ్ థైస్'' ట్రైలర్‌లో న్యూడ్ సీన్లు.. ట్విట్టర్‌కు వర్మ రాం రాం.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు వీడియోలు..

''గన్స్ అండ్ థైస్'' వెబ్ సిరీస్ ట్రైలర్ కలకలం రేపుతోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన గన్స్ అండ్ థైస్ సినిమా గురించి వివరాలు చెప్పాడు. వెబ్ చానల్ అయితే, సెన్సారింగ్ ఉండదని, ఎంత సమయం పాటు చూపు

''గన్స్ అండ్ థైస్'' వెబ్ సిరీస్ ట్రైలర్ కలకలం రేపుతోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన గన్స్ అండ్ థైస్ సినిమా గురించి వివరాలు చెప్పాడు. వెబ్ చానల్ అయితే, సెన్సారింగ్ ఉండదని, ఎంత సమయం పాటు చూపుతున్నామన్న దానికి పరిధులు ఉండవని వర్మ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌లోని న్యూడ్ సీన్లలో కొన్ని ట్రైలర్లో చూపడంపై స్పందించాడు. పాతికేళ్ల క్రితమే శేఖర్ కపూర్ 'బండిట్ క్వీన్' చిత్రంలో పూలన్ దేవిని నగ్నంగా చూపించారని వర్మ చెప్పుకొచ్చాడు. 
 
ఆ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలిచిందని వర్మ గుర్తు చేశాడు. తన సిరీస్‌లో సందర్భానుసారంగానే కొన్ని దృశ్యాలుంటాయన్నాడు. ముంబై మాఫియా గురించి తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని చెప్పాడు. ట్విట్టర్‌లో పోస్టులతో బోర్ కొట్టినందుకే దాన్ని వదిలేశానని, ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటానని తెలిపాడు. ఫోటోలు, వీడియోల ద్వారానే ఇకపై సోషల్ మీడియాలో మాట్లాడుతానని వర్మ వెల్లడించాడు. 
 
కాగా.. టైగర్ ష్రాఫ్, శ్రీదేవి, సన్నీలియోన్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్యాన్స్ నుంచి అక్షింతలు వేసుకోవడంతోనే వర్మ ట్విట్టర్ నుంచి తప్పుకోవాలని డిసైడైనట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.