మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (12:41 IST)

వామ్మో... రజనీకాంత్‌పై రామ్ గోపాల్ వర్మ ఫైర్.. కేసు పెడతా..

''టీవీ 9''పై క్రిమినల్ కేసు పెట్టేందుకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సిద్ధమవుతున్నట్లు ట్విట్టర్‌లో తెలిపారు. మంగళవారం వర్మ చేసిన ట్వీట్‌లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. టీవీ ఛానల్ టీవీ-9 యాంకర్

''టీవీ 9''పై క్రిమినల్ కేసు పెట్టేందుకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సిద్ధమవుతున్నట్లు ట్విట్టర్‌లో తెలిపారు. మంగళవారం వర్మ చేసిన ట్వీట్‌లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. టీవీ ఛానల్ టీవీ-9 యాంకర్ రజనీకాంత్‌పై మండిపడ్డాడు. 
 
నిజాలను నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యాడు. యాంకర్ రజనీకాంత్ తప్పుడు వార్తా కథనాలను ప్రసారం చేయిస్తున్నారని ఆరోపించాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అంటూ వార్తలు అందించడం కూడా నేరమేనని.. అతి త్వరలో టీవీ9 భారత చట్టాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. 
 
ఇదిలా ఉంటే.. బీజేపీ నేత తుమ్మల పద్మపై కూడా కేసు పెట్టబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. తనపట్ల పద్మ మాట్లాడిన తీరు బాగోలేదన్నారు. మొత్తం మీద వర్మ రివర్స్ కేసులతో జీఎస్టీ కేసు గొడవ మరింత ముదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.