సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (16:14 IST)

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అతిథిగా రామన్న యూత్ ఈవెంట్

Viswak sen poster
Viswak sen poster
అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. “రామన్న యూత్” సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 11న సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ ఫంక్షన్ కు అతిథిగా హాజరుకానున్నారు.
 
“రామన్న యూత్” సినిమా నుంచి రీసెంట్ గా హీరో  సిద్ధార్థ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బలగం వంటి సహజమైన మన నేటివ్ కథలు ఆదరణ పొందుతున్న నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “రామన్న యూత్” సినిమా కూడా ఆకట్టుకుంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 15న “రామన్న యూత్” సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.