గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (09:34 IST)

పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో క్లీంకార ఫేస్ చూపించిన ఉపసాన

charan - upasana
charan - upasana
రామ్ చరణ్ తన పుట్టినరోజైన నేడు బుధవారంనాడు తెల్లవారుజామున తిరుమల తిరుపతి దేవస్థానం చేరుకుని దేవదేవుని దర్శించుకున్నారు. తిరుమలలో కారు దిగినతర్వాత నుంచి భక్తులైన అభిమానులు అన్నయ్య.. హ్యాపీ బర్త్ డే అంటూ అరుస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Upasana-kleenkara
Upasana-kleenkara
కుమార్తె క్లీంకారను ఉపాసన ఒడిలో తగిలించుకుని తీసుకువస్తుండగా క్లీంకార ఫేస్ కోసం అక్కడి మీడియా, పలువురు సెల్ పోన్లతో ట్రై చేశారు. ఎట్టకేలకు ఆమె దేవస్థానం లోపలికి ప్రవేశిస్తుండగా సైడ్ నుంచి క్లీంకార ఫేస్ కనపడడడంతో అక్కడివారంతా ఆనందంతో ఫొటోలకు పనిచెప్పారు. అప్పటికీ సెక్యూరిటీ వారిస్తున్నా వినలేదు.
 
Upasana-kleenkara
Upasana-kleenkara
ఇక కారుదిగినప్పటినుంచీ ఉపాసన నోటిలో ఏదో మంత్రాన్ని జపిస్తూ గుడిలోపలికి రావడం ప్రత్యేకంగా కనిపించింది. గోవిందా..గోవిందా అనుకున్నట్లుగా ఆమె పెదాలు గోచరించాయి. రామ్ చరణ్, ఉపాసన, క్లీంకాక దేవుని దర్శనం తర్వాత నేరుగా కారులోకి వెళ్ళారు. అక్కడి మీడియా ముందు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కాగా, నేడు హైదరాబాద్ శిల్పకలావేదికలో అభిమానులు సమక్షంలో గ్రాండ్ లో చరణ్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి.