శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 28 జులై 2018 (13:36 IST)

'రంగస్థలం' సింగర్ పోలీసులకు చిక్కాడు.. ఎందుకో తెలుసా?

'రంగస్థలం' సింగర్ పోలీసులకు చిక్కాడు. పీకల వరకు మద్యం సేవించి, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపినందుకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ సింగర్ పేరు రాహుల్ సిప్లగంజ్. ఈయన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పో

'రంగస్థలం' సింగర్ పోలీసులకు చిక్కాడు. పీకల వరకు మద్యం సేవించి, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపినందుకు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ సింగర్ పేరు రాహుల్ సిప్లగంజ్. ఈయన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కాడు.
 
శుక్రవారం అర్థరాత్రి జూబ్లీ హిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్‌ వైపు వస్తున్న రాహుల్‌కు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా 178 పాయింట్లు వచ్చాయి. అయితే, తాగిన మైకంలో ఉన్న రాహుల్ పోలీసులకు సహకరించకుండా వారితో వాగ్వాదానికి దిగాడు. 
 
దీంతో కేసు బుక్ చేసిన పోలీసులు కారును సీజ్ చేశారు. రాహుల్‌తోపాటు యాంకర్, నటుడు లోబో కూడా ఉన్నాడు. రాహుల్ సిప్లిగంజ్ లైసెన్స్ లేకుండానే కారు నడిపినట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన 'రంగస్థలం' సినిమాలో టైటిల్ సాంగ్ పాడింది రాహులే కావడం గమనార్హం.