శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 26 మే 2018 (15:56 IST)

ట్రెండింగ్-రష్మీకి సుడిగాలి సుధీర్ లవ్ ప్రపోజల్.. కన్నీళ్లు పెట్టుకుంటూ.. ఇక పెళ్లేనా?

ఓ డాన్స్ రియాలిటీ షోకు ప్రదీప్ యాంకర్‌గా, రష్మి, సుడిగాలి సుధీర్, హేమంత్, వర్షిణిలు టీమ్ లిడర్స్‌గా, హీరోయిన్ ప్రియమణి, శేఖర్ మాస్టర్లు జడ్జిస్‌‌గా వ్యవహరిస్తారు. ఈ షో వేదికగా జబర్దస్త్ యాంకర్ రష్మీకి

ఓ డాన్స్ రియాలిటీ షోకు ప్రదీప్ యాంకర్‌గా, రష్మి, సుడిగాలి సుధీర్, హేమంత్, వర్షిణిలు టీమ్ లిడర్స్‌గా, హీరోయిన్ ప్రియమణి, శేఖర్ మాస్టర్లు జడ్జిస్‌‌గా వ్యవహరిస్తారు. ఈ షో వేదికగా జబర్దస్త్ యాంకర్ రష్మీకి.. యాక్టర్ సుడిగాలి సుధీర్ లవ్ ప్రపోజల్‌ చేశాడు. ఐదేళ్ల పాటు రష్మిని ప్రేమిస్తున్నానని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మరీ చెప్పేశాడు.. సుడిగాలి సుధీర్. 
 
వేలాది మంది చూసే టీవీ షోలో ఐదు నిమిషాల టైమ్ అడిగి మరీ సుడిగాలి సుధీర్.. రష్మికి లవ్ ప్రపోజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా సుడిగాలి సుధీర్‌ ప్రపోజల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయమంటూ కామెంట్లు పెడుతున్నారు. రష్మీని ఉద్దేశించి సుడిగాలి సుధీర్ చేసిన లవ్ ప్రపోజల్ సోషల్ మీడియా ట్రెండింగ్ అవుతోంది. 
 
ఈ వీడియోను చూసిన రష్మి మదర్ కూడా సుడిగాలి సుధీర్ లాంటి అబ్బాయిని వెతికిపట్టుకోలేనని, సుధీర్ గురించి తనతో రష్మి చెప్తూ వుండేదని వ్యాఖ్యానించారు. ఇంకా సుధీర్ రష్మిని అంత గాఢంగా ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నానని.. అతని ఇష్టం మేరకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని సుడిగాలి సుధీర్ మదర్ కూడా చెప్పేశారని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.