గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జనవరి 2025 (22:33 IST)

Rashmika Mandanna: కుంటుతూ.. గెంతుకుంటూ చావా ట్రైలర్ ఈవెంట్‌కు రష్మిక మందన్న.. అవసరమా? (video)

Rashmika Mandanna
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. చావా సినిమాలో రష్మిక మహారాణి యేసుభాయిగా కనిపిస్తుంది. ఈ ట్రైలర్ ఈవెంట్‌లో రష్మికనే హైలైట్‌గా మారింది. కొన్నిరోజుల క్రితం రష్మిక కాలికి గాయమైన సంగతి తెలిసిందే. 
 
Rashmika Mandanna
నేటి ఉదయం ఎయిర్ పోర్ట్‌లో కుంటుతూ.. వీల్ చైర్‌లో కనిపించిన రష్మిక.. అలాగే కుంటుతూ ఈవెంట్‌లో సందడి చేసింది. డిజైనర్ డ్రెస్‌లో కుంటుతూ స్టేజిమీదకు వెళ్ళింది. ఆమెకు విక్కీ కౌశల్ సహాయం చేశాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది రష్మిక ఎఫర్ట్స్‌కు ప్రశంసిస్తుండగా.. ఇంకొందరు విమర్శిస్తున్నారు. 
 
సినిమా గురించి.. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న చావా సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. క్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దినేష్ విజన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్‌కు రెడీ అవుతోంది.