సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (16:55 IST)

రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ హీరోగా ఏయ్... పిల్లా

Madhav, Shikawat
Madhav, Shikawat
మాస్ మహారాజా రవితేజ సోదరుడు, కొన్ని చిత్రాల్లో హీరోగా, ఆర్టిస్టుగా నటించిన రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజును కథానాయకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాతనల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ సినిమా నిర్మిస్తున్నారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహాప్రొడక్షన్స్ పతాకంపై బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికిఏయ్... పిల్లా' టైటిల్ ఖరారు చేశారు.
 
ఈ సందర్భంగా నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ ''హృదయానికి హత్తుకునే ఓఅందమైన ప్రేమకథా చిత్రమిది. థియేటర్లలో ప్రేక్షకులకు చక్కటి అనుబూతి ఇస్తుంది. వింటేజ్ ప్రేమకథగా 90ల నేపథ్యంలో రూపొందిస్తున్నాం. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నాం. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని అన్నారు. 
 
ఈ చిత్రంలో మాధవ్ భూపతిరాజు సరసన మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్రూబల్ షికావత్ నటిస్తున్నారు. కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిది. ప్రముఖ దర్శకుడురమేష్ వర్మ ఈ చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం. లుధీర్ బైరెడ్డి దర్శకుడిగాపరిచయం అవుతున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్కె నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు : అన్వర్ , కూర్పు: ప్రసన్న, కళ : చిన్నా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గణేష్ ముప్పానేని.