శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (10:19 IST)

రవితేజ రావణాసుర లో శేఖర్ మాస్టర్ పర్యవేక్షణలో పాట చిత్రీకరణ

Sekar master and raviteja team
Sekar master and raviteja team
అన్నపూర్ణ స్టూడియోస్‌లో రవితేజ, హీరోహీరోయిన్లపై వేసిన భారీ సెట్‌లో శేఖర్ మాస్టర్ పర్యవేక్షణలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. సుధీర్ వర్మ పర్ఫెక్ట్ ప్లానింగ్ వల్ల షూటింగ్ పార్ట్ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా చేసింది. ఇది రవితేజ రావణాసుర కోసం జరిగింది. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లగా నటిస్తున్నారు. 
 
భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రావణాసురు వేసవిలో విడుదలయ్యే క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఫస్ట్ గ్లింప్స్ రవితేజ పాత్రని  విభిన్న షేడ్స్ లో చూపించగా, థీమ్ నెంబర్,  రెండవ సింగిల్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.
 
సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్.
 
శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి సరికొత్త కథని అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌తో ఈ చిత్రాన్ని కథనంలో  ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు.
 
 ఏప్రిల్ 7, 2023న రావణాసుర ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.