శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (17:03 IST)

రవికుమార్ పనస నిర్మాతగా తొలి చిత్రం ప్రారంభం

Ravikumar Panasa, Thiruveer
Ravikumar Panasa, Thiruveer
ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో ఒక పిరియడ్ ఫిల్మ్  రూపొందుతోంది.రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్:1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త రవి కుమార్ పనస అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. 
 
మసూద లాంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా దగ్గరైన తిరువీర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. విభిన్న కథాంశంతో నూతన దర్శకుడు జి.జి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఈ చిత్రానికి సంబంధించిన  ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రాన్ని ప్రస్తుతాన్ని "ప్రొడక్షన్ నెంబర్ 1" గా పరిగణిస్తున్నారు. 
 
ఎక్కడా రాజీ పడిన నిర్మాణ విలువలతో, మునుపెన్నడూ చూడని కథాంశంతో, ప్రతిభావంతులైన నటులతో, దర్శకుడితో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులని అలరిస్తుందని రవికుమార్ పనస అన్నారు. ఏషియన్ ఫిలింస్ సమర్పణలో ఈ సినిమాని తీస్తుండడం మరింత సంతోషదాయకమన్నారు. ఇది ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా జానర్ లో రూపొందుతోందని తెలిపారు రవికుమార్ పనస.